Nsnnews// క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయని..సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో..అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న క్రీడలను..కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సమ్మయ్యలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన డీఐఈవో..విద్యార్థులతో కబడ్డీ ఆట ఆడి..విద్యార్థులను ఉత్సహ పర్చారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి.. ఇద్దరు చొప్పున ప్రిన్సిపాళ్లతో పాటు, అధ్యాపకులను కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసి.. ఎస్జీఎఫ్ అండర్ 19 గేమ్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా..క్రీడ స్ఫూర్తితో ఆటలు ఆడాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో.. కాంగ్రెస్ నాయకులు ఎల్లం యాదవ్, ఆర్గనైజింగ్ సభ్యులు కనక చంద్రం, విజయ్ కుమార్, జిల్లా క్రీడ పోటీల సహాయకులు వెంకటేష్, చిన్నకోడూరు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌లతో పాటు.., పలు కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడ ఇంచార్జీ అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Latestnews, Telugunews, Siddipet, School games Federation…