Nsnnews// అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే..ప్రధాని మోడీ 15 లక్షల కోట్లు విలువ చేసే అభివృద్ధి పనులు చేపట్టారని…బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ధరం గురవారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న నూతన సంస్కరణలతో..దేశం తిరుగులూని ఆర్థిక శక్తిగా ఎదిగిందనట్టుగా ఆయన పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగుల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్న మోడీ.. ప్రగతి రథచక్రాలను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. మేకింగ్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలు అమలు చేసి..దేశంలోని 65 శాతం యువత, నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో..రింగ్ రోడ్ల ఏర్పాటుతో ఉత్తర తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు. ,22 వేల కోట్లతో 8 పారిశ్రామిక వాడల ఏర్పాటుకు..కేంద్ర సర్కార్ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Politics news