Nsnnews// CM రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని.. హోంగార్డులు తెలిపారు. వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300మందిని సర్వీస్ నుంచి తప్పించారని బాధిత హోంగార్డులు తెలిపారు. హైదరాబాద్ లోని DGPకి విజ్ఞప్తి చేసేందుకు వచ్చిన హోంగార్డులు…తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమ గోడు చెప్పుకునేందుకు వెళ్తే మంత్రులు, MLAలు ఎవరూ పట్టించుకోలేదని. అదే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. CM హామీ మేరకు తమకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నారు.
Latest news,Telugu news,Telangana news