Nsnnews// మారుమూల గ్రామాల్లోని ప్రజలకు..రేవంత్ సర్కార్ తెచ్చిన…ఉచిత బస్సు ప్రయాణం నోటీకి అందని ద్రాక్షగానే మిగులుతోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామస్థులు..తమ గ్రామంలోకి బస్సు నడపాలని..తాము ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక..నాలుగు సార్లు తిరగాల్సిన బస్సు..కనీసం ఒక్కసారి కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్‌తో ఉచితంగా ప్రయాణం చేస్తామనుకున్న తమకు…బస్సు సౌకర్యం లేక, అవసరాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తమకు ఆధార్ ఉన్నప్పటీకి…లేని వారిగానే మిగిలిపోయామంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్, డిపో మేనేజర్లు స్పందించి బస్సు నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Latest news,Telugu news,Telangana news,Kamareddy District