Nsnnews// ఎన్నికల వేళ ఇచ్చిన రైతు రుణమాఫీ మాట మైమర్చింది కాంగ్రెస్ సర్కార్. రుణమాఫీ పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్..రైతుల సంక్షేమాన్ని యాదిమర్చింది. అర్హులైన రైతులందరికి..రుణమాఫీ చేయాలంటూ..బీఆర్ఎస్ ఇచ్చిన ఆందోళనల పిలుపుతో..సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిరసనల హోరు సాగింది.
రైతులకిచ్చిన రుణమాఫీ అమలును అర్హులైన వారికి పూర్తిస్థాయిలో అమలు చేయాలని… సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతు రుణమాఫీ పేరిట..రైతులను నయావంచనకు గురిచేస్తోందని…వెంటనే అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపచేయాలని..మిరుదొడ్డి తహశీల్ధార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో..11గ్రామాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు. అంతకముందుకు…కార్యాలయంలోకి రైతులతో కలసి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు..తహశీల్ధార్ కు..అర్హులైన రైతులకు చెందిన దరఖాస్తులు సమర్పించారు. మాయమాటలతో నమ్మబలికి..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా..రేవంత్ సర్కార్ రైతులను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి. 2లక్షల రుణమాఫీ కాని రైతులు..సంబంధిత అధికారుల ప్రశ్నలతో అయోమయానికి గురవుతున్నారన్నారు. అధికారుల సూచనలు సరైనవిగా లేని కారణంగానే.. రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి మాట్లాడారు. రైతులను అయోమయంలో పడేసింది.. కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్న ఆయన.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా..రైతుల ఉసురు తీస్తుందని ఆరోపించారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news