Nsnnews// కామారెడ్డి జిల్లా కేంద్రంలో..కరీంనగర్ ఆల్ ఫోర్స్ పాఠాశాల, కళాశాలల చైర్మన్ నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 కళాశాలలు, పాఠాశాలలో.. చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్టు చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా..34 సంవత్సరాలుగా విద్యాబోధన సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీఎన్నికలలో పోటీ చేస్తున్నట్టుగా చెప్పిన నరేందర్ రెడ్డి.. తనను పట్టాభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకే.. తాను గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Kamareddy District