Home తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం విద్యా కమిషన్‌ను నియమించింది || Telangana Govt Appointed Education Commission

తెలంగాణ ప్రభుత్వం విద్యా కమిషన్‌ను నియమించింది || Telangana Govt Appointed Education Commission

0
తెలంగాణ ప్రభుత్వం విద్యా కమిషన్‌ను నియమించింది || Telangana Govt Appointed Education Commission

 

Nsnnews// తెలంగాణలో విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 3 ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతోపాటు… సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా…విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అధికారులు.

నూతనంగా ఛైర్మన్‌, ముగ్గురు సభ్యులతో కూడిన విద్యా కమిషన్‌ ఏర్పాటు చేయనున్నారు రాష్ట్ర ఉన్నతాధికారులు. కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్‌తో పాటు.. విద్యా రంగాలలో నైపుణ్యం కలిగిన ముగ్గురు సభ్యులు, విభాగాధిపతి స్థాయి సభ్య కార్యదర్శి ఉంటారు. కమిషన్‌లోని నాన్-అఫీషియల్ సభ్యుల పదవీకాలం నియామకం తేదీ నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులను త్వరలో నియమించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా విద్యాకమిషన్ ఏర్పాటు చేశారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మారుతున్న విద్యారంగాన్ని పరిగణనలోకి తీసుకోనుంది. ప్రభుత్వానికి విధాన రూపకల్పనపై సలహాలు ఇవ్వడం, విద్యారంగంలో థింక్-ట్యాంక్‌గా పనిచేయడం, మేధోమథనం, ఆలోచనలతో పాటు…, ప్రయోగాత్మక అధ్యయనాల ద్వారా విలువ పెంచడం, పాలసీ నోట్స్, మార్గదర్శకాలు, నియమాలు, ఎక్స్‌పోజర్ సందర్శనలను సులభతరం చేయనుంది. కమిషన్ ప్రధాన లక్ష్యంగా అవసరమైన విధానాలను రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.

Latest news,Telugu news,Telangana news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here