Nsnnews// గణేశ్ మండపాల నిర్వాహకులతో సెప్టెంబర్ 2వ తేదీన భిక్నూర్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో.. పోలీసులు సమావేశం నిర్వహించనున్నట్టు కామారెడ్డి జిల్లా జాతీయ మానవ హక్కుల కమిటీ అధ్యక్షుడు మర్రి మహిపాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసులు నిర్వహించే ఈ సమావేశానికి.. ప్రతీ గ్రామంలో మండపాల ఏర్పాటు చేసే నిర్వాహకులు పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా సమావేశానికి హాజరైనా వారికి మాత్రమే అనుమతులిస్తారని పేర్కొన్నారు. గ్రామాల నుంచి కనీసం ఇద్దరు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు సైతం హాజరుకానున్నట్టు తెలిపారు.
Latest news,Telugu news,Telangana news