Nsnnews// మెక్సికోలో కాలం చెల్లిన ఓ పెద్ద విద్యుదుత్పత్తి కేంద్రాన్ని బాంబులతో నేలమట్టం చేశారు. బాంబుల ధాటికి పవర్ ప్లాంట్లోని నాలుగు 400 అడుగుల కూలింగ్ టవర్స్ ఏకకాలంలో లిప్తపాటులో కుప్పకూలాయి. ఘటనాస్థలిలో భారీ ధూళి మేఘాలు ఏర్పడ్డాయి. 1973లో నిర్మించిన శాన్ జువాన్ జనరేటింగ్ స్టేషన్లో 50 ఏళ్లుగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. 2022లో ప్లాంటు కార్యకలాపాలు నిలిపివేశారు. మెక్సికోలో చాలా రాష్ట్రాలు కార్బన్-రహిత విద్యుత్ వనరులను కోరుతుండటంతో పాటు ప్లాంటు కాలం కూడా చెల్లడంతో దీన్ని ధ్వంసం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణకు శిలాజ ఇంధనాల నుంచి దూరం వెళ్లాలన్న మెక్సికో నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Latestnews, Telugunews, Mexico, power plant, Collapse with Bombs…