Nsnnews// మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణె (Pune)లోని పౌద్ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికులున్నట్లు పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. అదృష్టవశాత్తూ వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు.
వీరిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినదిగా తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం నుంచి పుణెలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Latest news,Telugu news,Telangana News,National News,Maharashtra News