Nsnnews// హైదరాబాద్: తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని బి.ఆర్.ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చి రాజకీయం చేశారన్నారు. భారాస మహిళా నేతలపై దాడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వసతి గృహాల్లో పిల్లల సమస్యలపై ప్రస్తావించినట్లు కేటీఆర్ తెలిపారు. అంతకుముందు విచారణ సందర్భంగా కేటీఆర్కు మహిళా కమిషన్ సభ్యులు రాఖీలు కట్టారు.
Latest news,Telugu news,Telangana news