Nsnnews// నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలపై విచారణ కొనసాగుతోంది. వైసీపీ హయాంలో సిలికా, తెల్లరాయి, గ్రావెల్ అక్రమాలపై విచారణ జరుగుతోంది. సైదాపురంలో క్వార్ట్జ్ తవ్వకాలపై గతంలో టీడీపీ.. సీఐడీ డీఎస్పీకి పిర్యాదు చేసింది. మైనింగ్ అక్రమాలపై విచారణ చేయాలని సోమిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్రమ మైనింగ్‌లో ఇద్దరు మాజీ మంత్రులు, స్థానిక నేతలు కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. సజ్జల కనుసన్నల్లో శ్రీకాంత్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి దోపిడీ చేసినట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. మాజీ మంత్రి కారుమూరి అల్లుడు సందీప్‌కు అక్రమాల్లో హస్తం ఉన్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. సైదాపురం మండలం జోగుపల్లిలోని 8 గనుల్లో అక్రమ తవ్వకాలు జరిగాయి. సైదాపురంలోనే సుమారు రూ.8 వేల కోట్ల దోపిడీ చేసినట్లు సమాచారం. లక్షల టన్నుల క్వార్ట్జ్‌ను మార్కెట్‌లో అమ్మేశారని ఆరోపణలున్నాయి. ఈక్రమంలో మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్లు సమాచారం.
Latest news,Telugu news,Politics News,Andhra Pradesh News,Sri Potti Sriramulu Nellore News