Nsnnews// హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు మహిళా నేతలు, మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ తదితరులు సీఎంకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే రాగమయి తదితరులు రాఖీ కట్టారు. హైదరాబాద్ కోకాపేట్‌లోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు నివాసానికి పెద్ద సంఖ్యలో మహిళలు చేరుకుని ఆయనకు రాఖీ కట్టారు.
latestnews, Telugunews, Hyderabad, Revanthreddy, Rakshabandhan Celebrations….