Nsnnews// ముంబయి: ప్రముఖ విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు సోమవారం అప్పర్‌సర్క్యూట్‌ను తాకాయి. ఎన్‌ఎస్‌ఈలో 9.99 శాతం పెరిగి రూ.146.38 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.64,565.73 కోట్లకు చేరింది. పలు బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్‌పై సానుకూల వైఖరి వ్యక్తం చేసిన నేపథ్యంలోనే స్టాక్ రాణిస్తోందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు జరిగింది. ఒక్కో షేరుకు రూ.72-76 ధర నిర్ణయించారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సంస్థ రూ.6,100 కోట్లు సమీకరించింది. మదుపరులు రూ.14,972తో కనీసం 197 షేర్లకు బిడ్లు దాఖలు చేశారు.
ప్రిల్- జూన్ త్రైమాసికానికి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏకీకృత ప్రాతిపదికన రూ.347 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2023-24 ఇదే కాల నష్టం రూ.267 కోట్లతో పోలిస్తే ఈసారి ఇంకా పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.1,243 కోట్ల నుంచి రూ.1,644 కోట్లకు పెరిగింది. వ్యయాలు కూడా రూ.1,461 కోట్ల నుంచి రూ.1,849 కోట్లకు పెరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 3 విద్యుత్ మోటార్‌సైకిళ్లను విపణిలోకి గురువారం విడుదల చేసింది. ‘రోడ్‌స్టర్’ బ్రాండ్‌పై ఈ మోడళ్లను విక్రయించనుంది. తాజా 3 వేరియంట్లు రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో పేరిట లభిస్తున్నాయి. మరో 2 మోటారుసైకిళ్లను త్వరలో విడుదల చేస్తామని సంస్థ తెలిపింది. రోడ్‌స్టర్ ఎక్స్ రూ.74,999 ప్రారంభ ధరతో లభ్యమవుతుంది. 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఇది 117 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ ధర రూ.85,999 కాగా, 4.5 కిలోవాట్ అవర్ వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. ఒకసారి ఛార్జింగ్‌తో ఇది గరిష్ఠంగా 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 124 కిలోమీటర్లు. ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. 2025 జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రోడ్‌స్టర్ ప్రారంభ ధర (3.5 కిలోవాట్ అవర్) రూ.1.04 లక్షలు, 4.5 కిలోవాట్ ధర రూ.1,19,999, 6 కిలోవాట్ ధర రూ.1,39,999గా కంపెనీ పేర్కొంది. వీటి డెలివరీ కూడా వచ్చే జనవరి నుంచే. గరిష్ఠ వేగం 126 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జింగ్‌తో బ్యాటరీ ప్యాక్ ఆధారంగా 151-248 కి.మీ. ప్రయాణిస్తుంది. రూ.1.99 లక్షల రోడ్‌స్టర్ ప్రో గరిష్ఠ వేగం 194 కిలోమీటర్లు. ఇందులో 16 కిలోవాట్ అవర్ వేరియంట్ ధర రూ.2.49 లక్షలు. ఒకసారి ఛార్జింగ్‌తో 579 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 2025 దీపావళి నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.
Latestnews, Telugunews, Mumbai, Ola Electric Share…