Nsnnews// మానవత్వమే మంట కలుస్తున్న నేటి కాలంలో… పేద ప్రజలకు తమ వంతుగా సహాయం అందిస్తూ…మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఆ యూత్ సభ్యులు. కన్న పేగు బంధాన్నే దూరం కొడుతున్న మనుషులున్న సమాజంలో…నిరాశ్రయులైన నిరుపేదలకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ…ఆపన్నహస్తం కోసం ఎదురుచూసే అభాగ్యులకు చేయూతనిస్తున్నారు…. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర పురాకు చెందిన బండోరి మైసమ్మ యువసేన యూత్ సభ్యులు.
ఆపదలో ఉన్న వారికి తాము ఉన్నామనే ధైర్యాన్ని కల్పిస్తూ, నిరాశ్రయులైన నిరుపేదలకు…సిద్దిపేటలోని నాసరపురా కాలనీ బండోరి మైసమ్మ యువసేన యూత్ యువకులు… సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చిన ఇంటికి పెద్దకొడుకుల్లా అండగా ఉంటూ…తమ వంతుగా ఆర్థిక సహాయంతో పాటు…నిత్యావసర సరకులు పంపిణీ చేసి, మానవత్వం చాటుకుంటున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని నాసరపురా కాలనీకి చెందిన తిరుమల లక్ష్మణ్ దంపతుల కుమారుడు భార్గవ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న..బండోరి మైసమ్మ యువసేన యూత్ యువకులు బాధిత వ్యక్తి ఇంటికి వెళ్లి…ఆర్థిక సహాయంతో పాటు, 50కిలోల బియ్యం వితరణ చేశారు. మహమ్మరి కరోనా కష్టకాలంలో…సుమారు 6వందల కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులతో పాటు…, వంట గ్యాస్ అందించి, తోడుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిసర ప్రాంతాల్లో నివసించే…పేద ప్రజలకు సాయం చేయనున్నట్టు చెప్పారు. సేవా కార్యక్రమాలలో ముందుంటామని…యువజన సంఘాలకు ఆదర్శంగా నిలుస్తామని యూత్ సభ్యులు… నిమ్మల కనకయ్య, పయ్యావుల నరసింహులు తెలిపారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news