Nsnnews// అమెరికా అధ్యక్ష అభ్యర్థులుగా ఖరారైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ త్వరలోనే ముఖాముఖిగా ఎదురుపడనున్నారు. వచ్చే నెలలో వీరిద్దరూ తొలి డిబేట్‌లో పాల్గొననున్నారు. ఈ సంవాదానికి సిద్ధమవుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. హారిస్‌ను ఎదుర్కొనేందుకు ఓ మహిళ సాయం తీసుకుంటున్నారట. ఆమె మరెవరో కాదు.. డెమోక్రటిక్ పార్టీ మాజీ నాయకురాలు, భారత సంతతి నేత తులసీ గబ్బర్డ్ . డిబేట్ కోసం ప్రాక్టీస్ సెషన్‌లో ట్రంప్‌నకు ఆమె సాయం చేస్తున్నారట. ఈమేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది. ఫ్లోరిడాలోని మారే లాగోలో గల తన ప్రైవేట్ క్లబ్‌లో ట్రంప్ ప్రాక్టీస్ సెషన్ తీసుకుంటున్నారు. ఇందులో తులసీ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. ఈవిషయాన్ని ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్ లియావిట్ ధ్రువీకరించినట్లు సదరు కథనం వెల్లడించింది. ‘‘జో బైడెన్‌తో జరిగిన చర్చతోనే రాజకీయ చరిత్రలో ఉత్తమ డిబేటర్‌గా ట్రంప్ తనను తాను నిరూపించుకున్నారు. సంవాదాలకు ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు. కాకపోతే ఆయన ఈసారి ఓ మహిళను ఎదుర్కోబోతున్నారు. విధానపరమైన విషయాలతో పాటు మరిన్ని అంశాలపై ఆయన దృష్టిపెడుతున్నారు. ఈ క్రమంలోనే తులసీ గబ్బర్డ్ లాంటి నేతలతో ఆయన సమావేశమవుతున్నారు’’ అని కరోలిన్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.
Latestnews, Telugunews, US President Elections, Donald Trump, Tulsi Gabbard..