Nsnnews// ఏథెన్స్: గ్రీస్‌లోని చారిత్రక నగరం ఏథెన్స్ సమీపంలో కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తోంది. దాదాపు 500 మంది అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా అగ్నికీలలు అదుపులోకి రావడం లేదు. 152 ప్రత్యేక వాహనాలను వాడుతున్నారు. నీటిని చల్లే విమానాలను రంగంలోకి దించినా అగ్నికీలలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల అగ్నికీలలు 85 అడుగుల ఎత్తు ఉన్నట్లు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి. ఆదివారం నాటికి కార్చిచ్చు పట్టణానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. బలమైన గాలులు వీస్తుండడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానిక మారథాన్ సహా ఇతర ప్రాంతాలవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Latest news,Telugu news,International news…