Home అంతర్జాతీయం అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను పరీక్షించిన చైనా..! || China has tested the largest civilian transport drone..!

అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను పరీక్షించిన చైనా..! || China has tested the largest civilian transport drone..!

0
అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను పరీక్షించిన చైనా..! || China has tested the largest civilian transport drone..!

 

Nsnnews// చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి సాధిస్తోంది. తాజాగా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తొలిసారి పరీక్షించింది. దీనిని ఆ దేశానికి సిచువాన్‌ టెంగ్డెన్‌ సైన్స్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సంస్థ తయారుచేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ, విక్రయాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది.  రెండు ఇంజిన్లతో పనిచేసే ఈ డ్రోన్‌ ఏకంగా 2 టన్నుల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. సిచవాన్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రయోగం సందర్భంగా దాదాపు 20 నిమిషాలపాటు అది ప్రయాణించింది. 
ఈ డ్రోన్‌ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులు ఉంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే దీనిని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సెస్నా 172 విమానం కంటే కొంచెం ఎక్కువ పొడవే ఉంటుంది. 
ఇప్పటికే చైనా జూన్‌లో ఏవియేషన్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ తయారుచేసిన హెచ్‌హెచ్‌-100 అనే కార్గో డ్రోన్‌ను పరీక్షించింది. ఇది దాదాపు 700 కేజీల బరువును తీసుకొని.. 520 కిలోమీటర్లు ప్రయాణించింది. వచ్చే ఏడాది టీపీ2000 అనే యూఏవీని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది 2 టన్నుల పేలోడ్‌తో.. 2,000 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా వేస్తున్నారు. 
చైనా ప్రభుత్వం ఇటీవకాలంలో లోఆల్టిట్యూడ్‌ ఎకానమీ (తక్కువ ఎత్తులో కార్యకలాపాలు నిర్వహించే ఆర్థిక వ్యవస్థ)ను కూడా బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇది 2030 నాటికి నాలుగు రెట్లు పెరిగి 270 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆ దేశ ఏవియేషన్‌ రెగ్యులేటరీ అంచనా వేసింది. దీనిలో ప్రయాణికులను, సరకులను రవాణా చేయాలని పేర్కొంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్వాంగ్జుకు చెందిన ఈహంగ్‌ హోల్డింగ్స్‌ అనే సంస్థకు చెందిన మానవ రవాణా డ్రోన్‌కు అనుమతులు ఇచ్చింది. 2023 నాటికి చైనాలో దాదాపు 2,000కు పైగా సంస్థలు డ్రోన్ల తయారీ, డిజైన్‌లో పని చేస్తున్నాయి.
Latest news,Telugu news,International News,China

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here