Nsnnews// మద్యం ప్రియులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో 24 గంటలు తెరిచి ఉండే లికర్ షాపుకు లైసెన్స్ జారీ చేసింది. ఈ లిక్కర్ షాపు ఢిల్లీ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ -3 అరైవల్స్ ప్రాంతంలో త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.
ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. 24 గంటలు నడిచే లిక్కర్ షాపు ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేష్నల్ ఎయిర్ పోర్టులో ఉంటుంది. ఇందుకు గాను ఢిల్లీ కన్జూమర్ కో ఆపరేటివ్ హోల్ సేల్ స్టోర్ లిమిటెడ్‌కు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది. అయితే ఈ షాపులో వచ్చేందుకు డొమెస్టిక్ విమాన ప్రయాణాలు చేసేవారికి అనుమతి ఉంటుంది.
సెల్ఫె సర్వీస్, వాకిన్ ఫెసిలిటీ..
ఢిల్లీ ఎయిర్ పోర్టులో త్వరలోనే అందుబాటులోకి వచ్చే లిక్కర్ షాపు 750 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో విశాలంగా ఉంటుంది. ఈ షాపులో కస్టమర్లకు ప్రముఖ మద్యం బ్రాండ్స్ అందుబాటులో ఉంటాయి. పైగా కస్టమర్లు షాపులో నేరుగా వచ్చేందుకు వాకిన్ ఫెసిలిటీ, వారు స్వయంగా పలు రకాల మద్యం బ్రాండ్స్ చూసి తీసుకునే సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది.
ఢిల్లీ నగరంలో అన్ని మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. దేశ రాజధానిలో 24 గంటలు ఓపెన్ ఉండే తొలి మద్యం షాపు ఇదే అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. పైగా ఎయిర్ పోర్టులో మద్యం షాపులు డ్యూటీ ఫ్రీ రూపంలో ఇంటర్నేష్నల్ ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న మూడు డొమెస్టిక్ టర్మెనల్స్ ఒక్క మద్యం షాపు కూడా లేదు. ఢిల్లీ విమానాశ్రయానికి ఎక్కువ డొమెస్టిక్ ప్రయాణికులు ఉండడంతో కొత్తగా తెరిచే షాపుకు డిమాండ్ ఉంటుందని అధికారుల అభిప్రాయం.
ఈ కొత్త షాపులో ఎల్ ఈడీ స్క్రీన్లపై దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చి ఉన్న మద్యం ధరలు డిస్ప్లే చేస్తారు. యూపిఐ, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
Latest news,Telugu news,National news…