NSN NEWS //మంచిర్యాల జిల్లా ఏప్రిల్ 24:
ఈ రోజు ఉదయం ప్రకటిం చిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా కేంద్రం లోని దోరగారిపల్లేలో ఇంటర్ విద్యార్థిని ఈ రోజు ఆత్మహ త్యకు పాల్పడింది.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజశ్విని తాజాగా విడుదలైన ఇంట ర్మీడియట్ ఫలితాల్లో ఫెయి ల్ కావడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది.
దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం తేజశ్విని మృత దేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.