Nsnnews// మనం బస్సులో వెళుతూ ఉంటాం.. వాట్సప్ గ్రూప్‌లో వరుసగా వాయిస్ మెసేజ్‌లు వస్తూ ఉంటాయి.. వినడానికేమో సమయానికి ఇయర్ ఫోన్సు అందుబాటులో ఉండవు. అలాంటి సందర్భాల్లో బస్సు దిగాక గానీ వాటిని వినడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వాయిస్ సందేశాల్లో ఏముందో చెప్పే ఫీచర్‌ను వాట్సప్ తీసుకొస్తోంది. ఇదో ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫీచర్. అంటే.. వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలో చూపిస్తుందన్నమాట. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో ప్రస్తుతం ఈ ఫీచర్ తారసపడింది.
వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చే వాబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను గుర్తించింది. వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు లేదా పంపినప్పుడు దాని కింద ట్రాన్స్‌స్క్రిప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అందులోని సందేశం యథావిధిగా టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. అలాగని, ఇది ట్రాన్స్‌లేటర్ కాదు. కేవలం ఏ భాషలో ఉంటుందో ఆ భాషకు అక్షర రూపాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీ, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ భాషలకు సపోర్ట్ చేస్తోంది. ఇతర భాషలకూ తీసుకొస్తుందో లేదో చూడాలి. గతంలో ఐఓఎస్ బీటా యూజర్లకు ఇదే తరహా ఫీచర్ దర్శనమిచ్చింది. సాధారణ యూజర్లకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Latest news,Telugu news,Business News, Tech News, Whatsapp…