Home అంతర్జాతీయం మందమెక్కిన బైడెన్ మతిమరుపు.. జెలెన్‌స్కీని పుతిన్ అంటూ సంబోధన! || Demented Biden forgets.. Addressing Zelensky as Putin!

మందమెక్కిన బైడెన్ మతిమరుపు.. జెలెన్‌స్కీని పుతిన్ అంటూ సంబోధన! || Demented Biden forgets.. Addressing Zelensky as Putin!

0
మందమెక్కిన బైడెన్ మతిమరుపు.. జెలెన్‌స్కీని పుతిన్ అంటూ సంబోధన! || Demented Biden forgets.. Addressing Zelensky as Putin!

 

Nsnnews// Joe Biden Calls Zelensky| అమెరికా రాజకీయాలలో ప్రెసిడెంట్ జో బైడెన్ ఆరోగ్య సమస్యలపై జోరుగా చర్చలు జరుగుతున్న సమయంలో మరోసారి ఆయనకు వయసురీత్యా మతిమరుపు ఉన్నట్లు బయటపడింది. బహిరంగ సభలో అది కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన స్నేహితుడిని తన శత్రువు పేరుతో సంబోధించి మరో బ్లండర్ చేశారు జో బైడెన్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పేరుతో ఆయన సంబోధించారు. దీంతో మరోసారి ఆయనకు మతిమరుపు, వృద్ధాప్య సమస్యలున్నట్లు బయటపడింది. నవంబర్ నెలలో జరగబోయే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆయన డెమొక్రాట్ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థి కావడంతో బైడెన్‌కు వయసు రీత్యా ఆ పదవి అర్హుడు కాదేమో అని ప్రజల్లో సందేహం కలుగుతోంది.

అమెరికాలో నాటో దేశాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశం తరువాత ప్రెసిడెంట్ బైడెన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాటో కూటమి, ఉక్రెయిన మధ్య కుదిరిన ఒక ఒప్పందం గురించి ప్రకటించారు. ఆ ప్రకటన చేస్తున్న సందర్భంతో ఆయన ఇలా మాట్లాడారు. ”ఇప్పుడు చివరగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రసంగం చేస్తారు, ఆయన ఎంతో ఓర్పు కలవాడు, చాలా ధైర్యవంతుడు. లేడీస్ అండ్ జెంటిల్ మెన్ మీ ముందుకు వస్తున్నారు.. ప్రెసిడెంట్ పుతిన్” అంటూ బైడెన్ స్టీజీ దిగబోయారు, అంతలో ఆయనకు తన తప్పు తెలిసినట్లు అర్థమైంది.. అందుకే తిరిగి మైక్ వద్దకు వచ్చి ఇలా అన్నారు.. ”ఈయన ప్రెసిడెంట్ పుతిన్ ‌ని ఓడించే ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ. నేను పుతిన్ ఎలా ఓడించాలా? అని ఎక్కువగా ఆలోచిస్తుంటాను.. అందుకే ఆయన పేరు పలికేశాను” అని తన తప్పుని కవర్ చేసుకున్నారు.

బైడెన్ తప్పును మిగతా నాటో దేశాల నాయకులు కవర్ చేశారు. జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కూల్జ్ మాట్లాడుతూ.. మాట్లాడేటప్పుడు పదాలు తడబడడం, నోరు జారడం వంటివి జరుగుతుంటాయి. ఇలా చాలామందికి జరుగుతూనే ఉంటుంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మానుయెల్ మాక్రాన్, యుకె కొత్త ప్రధాన మంత్రి కీర్ స్టార్ మర్ బైడెన్ ఆరోగ్యంగానే ఉన్నారని.. ఈ విషయంలో అనుమానాలు లేవని చెప్పారు.

కమలా హ్యారిస్‌ని ట్రంప్ అంటూ సంబోధన…

బైడెన్ ఏదో తడబడ్డారని అని సర్దుకునే లోపే ఆయన మరో బ్లండర్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌ను.. వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అని పిలిచారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేకరులు ఆయనకు ఒక ప్రశ్న అడిగారు.

మీడియా ప్రశ్న: మీరు ఒకవేళ ఎన్నికల్ల నుంచి తప్పుకుంటే.. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్.. మీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించగలడని మీకు నమ్మకం ఉందా?

బైడెన్ సమాధానం: నాకు వైస్ ప్రెసిడెంట్ ట్రంప్‌పై నమ్మకం లేకపోతే.. నేనేందుకు ఆమెను వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తాను. ఆమె చాలా సమర్థురాలు.

బైడెన్ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూపోతుంటే.. ఆయనను సమర్థించే వాళ్లు కూడా ఆయనపై సందేహం కలుగుతోంది. త్వరలోనే ఆయన వైట్ హౌస్ బిగ్ బాయ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మీడియా ముందు ప్రసంగించాలి. అక్కడ ఆయన ఎలాంటి స్కిప్ట్ లేకుండా ప్రసంగించాలి.. పైగా మీడియా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. మతిమరుపు విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో బైడెన్‌కు ఈ కాన్ఫెరెన్స్ ఒక పరీక్షలా మారింది.

మరోవైపు బైడెన్ కు సొంత పార్టీ నేతలు, ఆయన స్నేహితుల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటివరకు ఆయన పార్టీలోని 14 మంది ఎంపీలు ఓపెన్ గా ఆయన ఎన్నికలను నుంచి తప్పుకోవాలని సూచించారు. ఈ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది.

Latest news,Telugu news,International News,Donald Trump,Joe Biden,USA…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here