Home అంతర్జాతీయం 17 మందిని కాల్చి చంపిన హంతకుడు.. ‘బ్రెయిన్‌’ ఇచ్చేందుకు అంగీకారం! || The killer who shot and killed 17 people.. agreed to give ‘brain’!..

17 మందిని కాల్చి చంపిన హంతకుడు.. ‘బ్రెయిన్‌’ ఇచ్చేందుకు అంగీకారం! || The killer who shot and killed 17 people.. agreed to give ‘brain’!..

0
17 మందిని కాల్చి చంపిన హంతకుడు.. ‘బ్రెయిన్‌’ ఇచ్చేందుకు అంగీకారం! || The killer who shot and killed 17 people.. agreed to give ‘brain’!..

 

Nsnnews//  ఎనిమిదేళ్ల క్రితం ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న భీకర కాల్పుల ఘటన అక్కడివారి కళ్లల్లో ఇంకా కదలాడుతూనే ఉంది. విద్యార్థులు, సిబ్బంది సహా మొత్తం 17 మంది చనిపోయిన ఆ కేసులో తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితుడు తన మెదడును దానం చేసేందుకు అంగీకరించాడు. బాధితుల్లో ఒకరితో కుదుర్చుకున్న ఒప్పందంలోని విషయాలు ఇటీవల బయటకు వచ్చాయి.
ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని ఓ హైస్కూల్‌లో నికోలస్‌ క్రజ్‌ అనే యువకుడు ఏఆర్‌-15 రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఫిబ్రవరి 14, 2018న జరిగిన ఘటనలో 13 మంది విద్యార్థులతోపాటు నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన దాడిగా నిలిచిన ఆ ఘటనలో ఆంథోనీ బోర్గెస్‌ అనే విద్యార్థి (అప్పుడు 15ఏళ్లు) తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. నిందితుడు క్లాస్‌రూమ్‌లోకి రాకుండా డోర్‌కు అడ్డుగా నిలిచిన బోర్గెస్‌పై ఐదుచోట్ల బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో పదికిపైగా సర్జరీలు చేయాల్సివచ్చింది. అయితే, ఈ కేసులో న్యాయపోరాటం చేస్తున్న బోర్గెస్‌.. ఇటీవల ఓ అసాధారణ ప్రతిపాదన తీసుకువచ్చాడు.
నిందితుడి మెదడు కావాలని.. దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తే, ఆ దుర్మార్గానికి పాల్పడటానికి దారితీసిన కారణాలను గుర్తించవచ్చని భావించాడు. తద్వారా భవిష్యత్తులో అటువంటి ఘటనలను నిరోధించవచ్చని అనుకున్న ఆయన.. నిందితుడి మెదడు కోసం న్యాయస్థానంలో పోరాడాడు. అందుకు నిందితుడు అంగీకరించడంతో వారిమధ్య సివిల్‌ ఒప్పందం జరిగినట్లు తెలిసింది. ఇందులోభాగంగా క్రజ్‌ పేరును సినిమాలు, పుస్తకాలతోపాటు ఇతర మీడియాలోనూ వాడుకునే హక్కులు సాధించాడు. వీటితోపాటు బోర్గెస్‌కు 4.3 లక్షల డాలర్లు ఇచ్చేలా అంగీకారం కుదిరింది.
గతంలో ఎన్నడూ ఇటువంటి సెటిల్‌మెంట్‌ చూడలేదని, నిజంగా ఇది ఊహించనిదని బాధితుల తరఫు న్యాయవాది స్కాట్‌ హెర్న్‌డోన్‌ పేర్కొన్నారు. మరోవైపు బాధిత కుటుంబాలకు 26 మిలియన్‌ డాలర్లను పాఠశాల యాజమాన్యం అందజేయగా, అందులో బోర్గెస్‌కు 1.25 మిలియన్ డాలర్లు లభించాయి. ఈ దుర్ఘటనను అడ్డుకోవడంలో విఫలమైనందుకు ఎఫ్‌బీఐ కూడా అతడికి కొంత పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ వ్యవహారానికి సంబంధించి పలు కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి.
Latestnews, Telugunews,Trump, Nicholas Cruz,  Borges, Brain Transfer..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here