Home తెలంగాణ వాట్సాప్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్ || A new safety feature in WhatsApp…

వాట్సాప్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్ || A new safety feature in WhatsApp…

0
వాట్సాప్‌లో కొత్త సేఫ్టీ ఫీచర్ || A new safety feature in WhatsApp…

 

Nsnnews// ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్  తన వినియోగదారుల భద్రత, ప్రైవసీ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా మరో ఉపయోగకర ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు వాట్సాప్ తాజాగా వెల్లడించింది . గ్రూప్ యాడింగ్‌కు సంబంధించి ప్రైవసీ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను ఈ ఫీచర్ దూరం చేయనుంది. మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తి మిమ్మల్ని ఇతర వాట్సాప్‌ గ్రూపులో యాడ్‌ చేసినప్పుడు ఈ ఫీచర్‌ కీలకంగా పనిచేస్తుంది.

మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తి మిమ్మల్ని ఓ గ్రూప్‌లో యాడ్ చేసినపుడు అతడి పేరు తెలిపే కాంటెక్ట్స్ కార్డ్ మీకు కనిపిస్తుంది. ఆ గ్రూప్‌‌ను ఎప్పుడు, ఎవరు క్రియేట్‌ చేశారు వంటి వివరాలు అందులో ఉంటాయి. ఆ వివరాల ఆధారంగా ఆ గ్రూప్‌లో మీరు ఉండదలచుకున్నారా? లేదా? అని మీరే నిర్ణయం తీసుకోవచ్చు. నిజానికి ఇలాంటి ఫీచర్ కొద్దిపాటి మార్పులతో ఇప్పటికే వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని యూజర్లు మీకు వ్యక్తిగతంగా మెసేజ్‌ చేసిన సమయంలో.. “మీకు మెసేజ్ చేసిన వ్యక్తి మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేరు“ అనే మెసేజ్ వస్తుంది.

ఆ ఫాత ఫీచర్‌కే వాట్సాప్ తాజాగా కొన్ని అదనపు హంగులు జోడించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మరికొంత అదనపు భద్రత, సమాచారాన్ని పొందే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ ప్రస్తుతం కొంత మందికే అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికి అందుబాటులోకి రాబోతున్నట్టు మెటా పేర్కొంది. స్పామ్‌ లేదా మోసపూరిత వ్యక్తుల నుంచి వాట్సాప్‌ వినియోగదారులకు భద్రత కల్పించేందుకే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మెటా వెల్లడించింది.

Latestnews, Telugunews, WhatsApp, new safety feature…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here