Nsnnews// దిల్లీ: మనదేశంలో మరింతగా ఉనికి పెంచుకునేందుకు తన ప్రీమియం ఎస్యూవీ మోడల్ కొడియాక్‌లో తాజా వెర్షన్‌తో పాటు మరిన్ని కొత్త మోడళ్లను పరిచయం చేసేందుకు స్కోడా చూస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. కుషాఖ్ మోడల్‌తో ఇప్పటికే మధ్య స్థాయి ఎస్యూవీ విభాగంలో స్కోడా తన ఉనికిని చాటుతోంది. ప్రీమియం సెడాన్ ఆక్టేవియాను మళ్లీ పరిచయం చేయాలనుకుంటున్నామని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జానేబా వెల్లడించారు. ఎస్యూవీ మోడళ్లకు గిరాకీ ఉంటున్నందున, ఈ విభాగంలోనే మరిన్ని మోడళ్లు తీసుకొస్తామని వివరించారు. ఈ ఏడాది చివర్లో సీబీయూ (కంప్లిట్లీ బిల్ట్ యూనిట్)ల విక్రయాలను ప్రారంభించి, వచ్చే ఏడాది నుంచి స్థానిక అసెంబ్లింగ్ మొదలుపెడతామని జానేబా తెలిపారు. బ్యాటరీ-విద్యుత్ మోడళ్లను కూడా భారత్‌కు తీసుకొచ్చే యోచనలో కంపెనీ ఉంది.
Latest news,Telugu news,Business news…