Nsnnews//AP విజయవాడ: విజయవాడలో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ సీపీతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు.
విజయవాడ కేంద్రంగా ఇటీవల కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే.. కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండా వెంకటప్పటయ్యకాలనీకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయారు. ఈ మేరకు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత తాజాగా స్పందించారు.
Latest news,Telugu news,Andhra Pradesh News,Vijayawada News