Home క్రైమ్ కాగజ్‌నగర్‌లో తల్లీ ముగ్గురు కూతుళ్ల ఆత్మహత్యాయత్నం

కాగజ్‌నగర్‌లో తల్లీ ముగ్గురు కూతుళ్ల ఆత్మహత్యాయత్నం

0
కాగజ్‌నగర్‌లో తల్లీ ముగ్గురు కూతుళ్ల ఆత్మహత్యాయత్నం

 

Nsnnews// కుమురంభీం ఆసిఫాబాద్‌: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం గజ్జెడలో నలుగురు మహిళలు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీ ముగ్గురు కుమార్తెలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మద్యానికి బానిసైన భర్త వేధింపులు తట్టుకోలేకే తన కూతుళ్లతో కలిసి మహిళ బలవన్మరణానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

Latest news,Telugu news,Crime, Telangana, Adilabad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here