Nsnnews// వర్షాకాలంలో అధిక తేమ, వర్షం కారణంగా కొన్ని కూరగాయలు తేమ వాతావరణాన్ని పెంచుతాయి. బ్యాక్టీరియా, శిలీంద్రాలు, సూక్ష్మజీవుల పెరుగుదలను ఇవి ప్రోత్సహిస్తాయి. అలాంటి వాటిలో ఆకుకూరలను ప్రధానంగా చెప్పవచ్చు. బచ్చలికూర, మెంతికూర, కాలే వంటి పచ్చని ఆకుకూరలలో వాతావరణంలోని తేమ వల్ల సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా పెరుగుతాయి. వర్షాకాలంలో ఆకుకూరలు తినడం వల్ల అజీర్ణం, ఇన్ఫెక్షన్లు రావచ్చు. వీటిని తినేముందు జాగ్రత్త చాలా అవసరం.
వర్షాకాలంలో కాలిఫ్లవర్, బ్రోకలీ తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటి ఆకులపై పురుగుల గుడ్లు ఉంటాయి. అలాగే వీటి లోపల కూడా పురుగులు, వాటి తాలూకు గుడ్లు ఉంటాయి. వీటిని తింటే ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఇది అనారోగ్యానికి కారణమవుతుంది. వంకాయ మొక్క తెగుళ్ల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఆల్కలాయిడ్స్ అని పిలువబడే రసాయన సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ సమ్మేళనం వంకాయలను విషపూరితం చేస్తుంది. ఇది దురద, వికారం, దద్దుర్లు, అలెర్జీ వంటి సమస్యలకు కారణం అవుతుంది.
Latestnews, Telugunews, Rainyseason, Vegetables…