Home జాతీయం దూసుకెళ్తున్న స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​@79551​ ఆల్​ టైమ్​ హై- జీవనకాల గరిష్ఠాన్ని తాకిన నిఫ్టీ

దూసుకెళ్తున్న స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​@79551​ ఆల్​ టైమ్​ హై- జీవనకాల గరిష్ఠాన్ని తాకిన నిఫ్టీ

0
దూసుకెళ్తున్న స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​@79551​ ఆల్​ టైమ్​ హై- జీవనకాల గరిష్ఠాన్ని తాకిన నిఫ్టీ

 

Nsnnews// దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం కూడా దూసుకెళ్తున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 308.49 పాయింట్ల లాభంతో 79,551 ఆల్​ టైమ్​ హై రికార్డ్​ నమోదు చేసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 103.75 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

లాభాల్లో ఉన్న స్టాక్స్​ : 30 సెన్సెక్స్ కంపెనీల్లో సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్, నెస్లే అత్యధికంగా లాభపడ్డాయి.

నష్టాల్లో ఉన్న స్టాక్స్​ : అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్, షాంఘై మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం పాజిటివ్​గా ముగిశాయి.

Latest news,Telugu news,Business,Gaining stocks,Domestic stock…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here