మే 1న తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు?
తెలంగాణలో పదోతరగతి పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 3 నుంచి 20 వరకు జవాబు పత్రాల స్పాట్ వాల్యూయే షన్ ప్రక్రియ పూర్తయింది.
ఫలితాలను డీకోడింగ్ చేయడానికి మరో వారం రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 30న ఫలితాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు.
ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మే 1న వెల్లడించే అవకాశం ఉంది…