Home జిల్లా వార్తలు ఆందోల్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

ఆందోల్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

0
ఆందోల్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

NSN NEWS// అందోల్//
21-04-2024 :-ఆందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్ పడిగే సుమిత్ర,రాయికోడ్ మండల జడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ షేరి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా డిసియం యస్ మాజీ చైర్మన్ వల్లంపల్లి సిద్దన్న పాటిల్ మాజీ ఎంపీపీ, రాయికోడ్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బస్వరాజ్ పాటిల్ మల్లంపల్లి ఎంపీటీసీ సత్యమ్మ శ్రీశైలం మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రజా ప్రతినిధుల కోలాహలంగా మారిన మంత్రి దామోదర్ రాజనర్సింహ నివాసం రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 300 మంది బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో ఆందోల్ నియోజకవర్గం లో బిర్ యస్ పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు సుమారు 300 మంది రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే ఇచ్చిన అయిదు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. గత పది ఏళ్లలో నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఆందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి గా నియోజకవర్గంలో చేపట్టిన పనులు తప్ప కొత్తగా చేపట్టిన పనులేవి లేవన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో పలువురు తాజా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి పలు గ్రామా శాఖల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో బిర్ యస్ పార్టీకి రాజీనామా చేసి సుమారు 300 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కుర్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here