Home తెలంగాణ బంగారం ధరలకు రెక్కలొచ్చాయ్….

బంగారం ధరలకు రెక్కలొచ్చాయ్….

0
బంగారం ధరలకు రెక్కలొచ్చాయ్….

 

Nsnnews// దేశవ్యాప్తంగా బంగారం ధరలు కాస్త పెరగగా, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150పెరిగి… 65 వేల 850కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 170 పెరిగి… 71 వేల 840 వద్ద స్థిరపడింది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66 వేలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71 వేల 990గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65 వేలు850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71 వేల 184 గా ఉంది. ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 65వేల580గా ఉండగా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71 వేల 184 గా ఉంది. కిలో వెండిపై 4 వేల 500 తగ్గింది. మార్కెట్ లో కేజీ వెండి 95 వేలుగా ఉంది.

Latestnews, Telugunews, Gold Rates…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here