Nsnnews// దేశవ్యాప్తంగా 70 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వృద్ధులందరికీ ..ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపచేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది.
కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను.. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఆయుష్మాన్ స్కీం వర్తింపుతో మొత్తం 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు 5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా లభించనుందని ఆయన తెలిపారు. ఇదివరకే ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్న కుటుంబాల్లోని వృద్ధులకు.. కొత్తగా ప్రత్యేక కార్డులు ఇవ్వనున్నారని చెప్పారు. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా ఉండగా.. ఇకపై కుటుంబంతో సంబంధం లేకుండా 70 ఏండ్లు, ఆపై వయసు కలిగిన వృద్ధులకు అదనంగా మరో5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. అయితే, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీంలలో దేంట్లోనైనా చేరిన వృద్ధులు అందులోనే కొనసాగవచ్చని.. లేదంటే దానిని వదులుకుని ఆయుష్మాన్ స్కీంలో చేరవచ్చని తెలిపారు.
Latest news,Telugu news,National news