Nsnnews// సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6వేల 200 మంది పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లను తొలగించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని అడిగితే ఒకేసారి అంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని హరీశ్ రావు మండిపడ్డారు. ఇదేనా ప్రజా పాలన..? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం….? అని నిలదీశారు. ఈ నిర్ణయంతో వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్న హరీశ్.. వెంటనే తొలగించిన పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లు, DEOలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు.
Latest news,Telugu news,Telangana news,Politics news