Nsnnews// 45వ చెస్ ఒలింపియాడ్ లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో పురుషులు, మహిళల జట్లు.. తొలిసారి స్వర్ణాలను కైవసం చేసుకున్నాయి. స్లొవేనియాతో జరిగిన 11వ రౌండ్ లో పురుషుల జట్టు సభ్యులు డి.గుకేశ్ , అర్జున్ ఇరిగేశీ, ప్రజ్ఞానందలు తమ ఆటల్లో గెలుపొందారు. మహిళల జట్టు 11వ రౌండ్ లో 3.5-0.5తో అజర్ బైజాన్ పై విజయం సాధించింది. డి.హారిక, దివ్య దేశ్ ముఖ్ లు తమ గేముల్లో విజయం సాధించగా..ఆర్ .వైశాలి డ్రాగా ముగించింది. అనంతరం వంతిక అగర్వాల్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించగా.. మహిళల జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
Latestnews, Telugunews, 45th Chess Olympiad, India,Creates History..