కేసీఆర్ రోడ్ షో ను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం
NSN NEWS ప్రతినిధి జమ్మికుంట మే 01:
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గురువారం సాయంత్రం 6 గంటలకు జరిగే మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్ రోడ్ షో ను విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. రైతులకు సాగునీరు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి మత రాజకీయాలు చేస్తోందని, తెలంగాణకు తెచ్చింది ఏమీ లేదని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంటకు వస్తున్న కెసిఆర్ కు ఘన స్వాగతం పలకాలని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయామని బాధ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారని అన్నారు. కెసిఆర్ రోడ్ షో కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు,పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.