Nsnnews// మా 19 ఎకరాల భూమిని పోలీసులే కబ్జాదారులకు ఇప్పించారు, రాచకొండ సీపీ మమ్మల్ని బెదిరించారు. 50 ఏళ్లుగా మల్కాజిగిరి తిరుమలగిరిలో 398, 399, 409, 410, 411/1, 411/2, 579 సర్వే నంబర్లలో మా భూమి ఉంది. గోడౌన్, షెడ్‌లకు అనుమతులు తీసుకుని కట్టాము.. కాంపౌండ్ వాల్ ఉంది, మున్సిపల్, రెవెన్యూ రసీదులు కూడా ఉన్నాయి. కొందరు దుర్మార్గులు కబ్జా కోసం వచ్చినపుడు పోలీసులను సంప్రదించాం. సీఐ సూచన మేరకు రాచకొండ సీపీని కలవగా.. సీపీ మమ్మల్ని బెదిరించారు. మైనంపల్లి హన్మంతరావు ద్వారా సీఎం రేవంత్ బ్రదర్స్‌ను కలవాలని చెప్పారు. రూ. 500 కోట్ల ఆస్తి.. వెళ్లి సెటిల్ చేసుకోవాలని చెప్పగా.. డీజీపీకి ఫిర్యాదు చేశాం. మా షెడ్‌లు.. మెడికల్ ఎక్విప్ మెంట్ ధ్వంసం చేసి స్క్రాప్ కింద అమ్మేశారు ఇప్పటికీ వంద మంది ఆయుధాలతో మా స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కష్టం వస్తే పోలీసులకు చెప్పుకుంటాం. పోలీసులు దగ్గర ఉండి ఎలా కబ్జా ఇప్పిస్తారు, 50 ఏళ్లుగా లీగల్ గా పొజిషన్‌లో ఉన్నాం.. ఎవరి దగ్గరికో మేము ఎందుకు వెళ్ళాలి ? ఏమైనా అంటే సీఎం బ్రదర్స్.. ఫయీంను కలవండని పోలీసులు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని మాకు పొజిషన్ ఇప్పించి న్యాయం చేయాలి – రాకేష్ రెడ్డి.
Latestnews, Telugunews, Telangananews, Politicalnews…