Nsnnews// రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు.. తమ ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రులు పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇప్పటికే మంత్రుల సబ్ కమిటీ ఈ సమస్యపై అధ్యయనం చేసిందని, క్షేత్రస్థాయిలో స్థానికత అంశానికి సంబంధించి పరిశీలన కూడా జరిగిందన్నారు. 317 జీవో కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో గాంధీభవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా JAC ప్రతినిధులతో గాంధీభవన్ లో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు చర్చలు జరిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సమస్య పరిష్కారానికి… తాము సిద్ధంగా ఉన్నామని వారికి వివరించారు.
Latest news,Telugu news,Telangana news