Nsnnewstelugu//23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం
తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల యువతిని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని నిందితులు దారుణంగా హింసించారని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైగ్రౌండ్స్ పోలీసులు గురువారం తెలిపారు.