Home బిజినెస్ 2030నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ || Electric vehicle market in the country by 2030…

2030నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ || Electric vehicle market in the country by 2030…

0
2030నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ || Electric vehicle market in the country by 2030…

 

Nsnnews// 2030నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ …ఏటా కోటి యూనిట్లకు పెరిగి 5కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని….కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న గడ్కరీ…దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. 2030నాటికి దేశంలో ఈవీల మార్కెట్ విలువ 20లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. అదే కాలానికి ఈవీల ఫైనాన్స్ మార్కెట్ 4 లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. లిథియం అయాన్ బ్యాటరీ ధరలు తగ్గి, ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు భారీగా పెరుగుతాయని గడ్కరీ తెలిపారు. 2023లో 30లక్షల ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు జరిగినట్టు చెప్పారు. దేశంలో మొత్తం ఈవీల అమ్మకాల్లో…ద్విచక్ర వాహనాల వాటా 56శాతంగా ఉన్నట్టు తెలిపారు. భారత్ ను…ప్రపంచ ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడించారు.

Latestnews, Telugunews, ElectricVechicles market,  Nitin gadkari…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version