Nsnnews// ఈనెల 17న పబ్లిక్ గార్డెన్ లో….. ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈనెల 17న ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి…అనంతరం పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని సీఎస్ తెలిపారు. పబ్లిక్ గార్డెన్ లో పోలీసు గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో CS శాంతికుమారి సమీక్షించారు. కార్యక్రమాన్ని ఘనంగా జరిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభా స్థలంలో..మౌలిక సదుపాయాల కల్పన, ఆహ్వానితుల వాహనాలకు పార్కింగ్ సదుపాయం సహా.. శానిటేషన్, భద్రతా తదితర ఏర్పాట్లు చేయాలని శాంతికుమారి నిర్దేశించారు. అదేరోజు గణేష్ నిమజ్జనం ఉన్నందున ప్రజాపాలన దినోత్సవానికి హాజరయ్యే వారికి.. ట్రాఫిక్ మార్గాలను ముందస్తుగా తెలియచేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, పర్యాటక భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు.
Latestnews, Telugunews, Democracy Day, Public Garden, Shantikumari…