Nsnnews// శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని గద్దపాక ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం ప్రార్థన సమయంలో పరిస్థితి ఇది. ఇక్కడ మొత్తం 11 మంది విద్యార్థులున్నారు. ఆరో తరగతిలో ఇద్దరు, ఏడులో ఒకరు, ఎనిమిదిలో నలుగురు, పదిలో నలుగురు ఉన్నారు. ఏడుగురు ఉపాధ్యాయులు వీరికి పాఠాలు బోధిస్తున్నారు. మంగళవారం ప్రార్థన సమయానికి నలుగురు విద్యార్థులే రాగా తర్వాత మరో నలుగురు వచ్చారు. గతేడాది 13 మంది విద్యార్థులు ఉండగా ఐదుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించారు. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల సంఖ్య పెంపు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నామని ప్రధానోపాధ్యాయుడు రమేశ్ తెలిపారు.
Latest news,Telugu news,Karimnagar district,Telangana news