Nsnnews// లద్దాఖ్: భారత్- చైనా సరిహద్దు లో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళం స్వాధీనం చేసుకొంది. ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంది. జులై 9న తూర్పు లద్దాఖ్‌లో ఇండో- టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటీబీపీ) బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లింగ్ గురించి సమాచారం అందడంతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించారు. సోదాలు చేయగా 108 కిలోల బంగారు కడ్డీలతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, బైనాక్యులర్, రెండు కత్తులు, చైనాకు చెందిన కొన్ని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీబీపీ వెల్లడించింది. ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపింది.
Latestnews, Telugunews, Ladakh, Indo China border, Gold Smugglers Arrest..