Nsnnews// విమానాలకు బాంబు బెదిరింపుల వ్యవహారంలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ తీరుపై కేంద్రం మండిపడింది. ఒక్క వారంలో 100కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయన్న సమాచారం సామాజిక మాధ్యమాల నుంచే వచ్చిన నేపథ్యంలో. కేంద్రం ఆయా సోషల్ మీడియా ప్రతినిధులతో వర్చువల్ గా సమావేశమైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంకేత్ ఎస్.భోండ్వే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో…సామాజిక మాధ్యమాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్ తీరు నేరాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని మండిపడినట్లు సమాచారం. ఇటువంటి బెదిరింపులు వ్యాప్తి చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియాజేయాలని సామాజిక మాధ్యమాల ప్రతినిధులను… కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది.
Latestnews, Telugunews, Bomb Thrat Calls,Central Govt, Crimenews…