Home తెలంగాణ హైడ్రా రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ || Petition in High Court to cancel Hydra…

హైడ్రా రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ || Petition in High Court to cancel Hydra…

0
హైడ్రా రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ || Petition in High Court to cancel Hydra…

 

Nsnnews// హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు.. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాను రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలైనా పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ మేరకు పిటిషనర్ జీఓ 99ను ఛాలెంజ్ చేశారు. ఇందులో జీహెచ్ఎంసీ యాక్ట్‌ను కాదని, హైడ్రాకు ఎలా అధికారులు ఇస్తారని పిటిషనర్ పేర్కొన్నారు. హైడ్రా చట్టబద్దతను రద్దు చేయాలని కోరారు. హైడ్రాపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. అలాగే హైడ్రాను రద్దు చేయాలనే పిటిషన్‌పై విచారణ సమయంలో.. హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. జీఓ 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ… అమీన్ పూర్‌లో కొన్ని షెడ్లు కూల్చివేశారన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.ఇదిలా ఉండగా,..హైడ్రా ఇప్పటివరకు చెరువుల ఎప్టీఎల్ పరిధిలోని వ్యాపార అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. తుమ్మడి కుంట ఎన్ కన్వెన్షన్ తో పాటు.. అప్పా చెరువులోని అక్రమ నిర్మాణాలను సైతం కూల్చివేసింది హైడ్రా.

Latestnews, Telugunews, Hyderabad, High Court Petition, Hydra..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here