Home తెలంగాణ హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ || Commissioner of Police Dr. B. Anuradha, IPS who visited Husnabad Police Stations

హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ || Commissioner of Police Dr. B. Anuradha, IPS who visited Husnabad Police Stations

0
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లను  సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ || Commissioner of Police Dr. B. Anuradha, IPS who visited Husnabad Police Stations

 

Nsnnews// ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారురోడ్డు ప్రమాదాల నివారణ గురించి రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్లతో తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించాలిఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలి ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా పటిష్టం చేసి సమూలంగా నిర్మూలించాలి. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అధికారులు సిబ్బంది నిజాయితీగా విధులు నిర్వహించాలి విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. ఇసుక,జూదం, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ సిడి ఫైల్స్ తనిఖీ చేశారు ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని ఎస్ఐకి సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందితో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి కేసులో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తుకు రిసిప్ట్ ఇవ్వాలని రిసెప్షన్ సూచించారు. అంకితభావంతో విధులు నిర్వహించాలని,అదే సమయంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై విధులు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాల గురించి మరియు ప్రజలు ఎవ్వరూ సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. విపిఓ విలేజ్ పోలీస్ ఆఫీసర్ బుక్స్ తనిఖీ చేశారు, గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తుపదార్థాల వల్ల కలిగే పర్యవసానాల గురించి గురించి స్కూల్ లలో కాలేజీలలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలు అమ్మే వారిపై సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు.
గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను ఉక్కు పాదంతో అణిచివేయాలని తెలిపారు.
గ్రామాలలో మండల కేంద్రంలో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహించే వారిపై నిఘా పెంచాలని తెలిపారు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా గ్రామాలను సందర్శించి ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకోవాలని సూచించారు. ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. నూతన చట్టాల గురించి గ్రామాలలో మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. సిబ్బంది యొక్క సాధక బాధలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. సమయం దొరికినప్పుడల్లా వాకింగ్ రన్నింగ్ యోగా చేస్తూ ఉండాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు.
స్కూళ్లు కాలేజీలు బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. గ్రామాలలో పట్టణాలలో పనిచేయని సీసీ కెమెరాలు గురించి సంబంధిత వ్యాపారులు ప్రజాప్రతినిధులతో కలసి నేను సైతం ద్వారా రిపేర్ చేయించాలి, మరియు కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వర్టికల్ వారిగా విధులు నిర్వహించే సిబ్బంది గురించి అడిగి తెలుసుకుని తగు సూచనలు సలహాలు చేశారు ప్రతి సమాచారాన్ని ఆన్లైన్ చేయాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ లో డాటా ను ఏ రోజు కా రోజు అప్డేట్ చేయాలని సూచించారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరగా డిస్పోజల్ చేయాలని తెలిపారు. విధినిర్వహణలో పోటీపడి విధులు నిర్వహించే వారికి ప్రతి నెల రివార్డులు అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమూలంగా నిర్మూలించాలని తెలిపారు. పాత నేరస్తులైన కేడీలు డీసీలు సస్పెక్ట్ లను తరచుగా తనిఖీలు చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక ఫిర్యాదురాలు దరఖాస్తు ఇవ్వగా ఏం జరిగింది ఎందుకు వచ్చారని వివరాలు కనుక్కొని ఆమె సమస్యను వెంటనే పరిష్కరించాలని హుస్నాబాద్ ఎస్ఐ మహేష్, సీఐ శ్రీనివాస్ కు సూచించారు*ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపి సతీష్, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కోర్టు లైజనింగ్ ఇన్స్పెక్టర్ కమలాకర్, హుస్నాబాద్ ఎస్ఐ మహేష్, అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్, కోహెడ ఎస్ఐ అభిలాష్, సీసీ నితిన్ రెడ్డి, ఇరు పోలీస్స్టేషన్ల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latestnews, Telugunews, telanganews, Husnabadnews..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here