Nsnnews// అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీపిస్తువేళ..అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్, హారీస్ మధ్య జరిగిన ఫస్ట్ డిబేట్ ఆసక్తికరంగా సాగింది. షేక్ హ్యాండ్స్ తో ప్రారంభమైన హారీస్, ట్రంప్ డిబేట్.. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఇమ్మిగ్రేషన్, విదేశాంగ విధానాలతో పాటు.., ఆరోగ్య సంరక్షణ, పునురుత్పత్తి హక్కులపై హాట్ హాట్ గా సాగింది.
అమెరికాను మళ్లీ నెంబర్ వన్ గా నిలపడమే తన లక్ష్యమన్నారు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. దేశం కోసం కమలా హ్యారిస్ దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. బైడెన్, కమలాలు అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమంగా దేశంలోకి వచ్చిన వారు… హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఫైరయ్యారు. పెన్సిల్వేనియాలోని నేషనల్ కానిస్టిట్యూషన్ సెంటర్ వేదికగా ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య జరిగిన డిబేట్ లో ఇద్దరు నేతలు విమర్శల దాడికి దిగారు. ట్రంప్ ప్రజాస్వామ్యంపై దాడి చేశారని మండిపడ్డారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అబార్షన్లకు వ్యతిరేకమని కమలా ఆరోపించగా.. తొమ్మిదో నెలలో బేబీని చంపడం దారుణమని కౌంటర్ ఇచ్చారు ట్రంప్. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాకు చిక్కులేనని వ్యాఖ్యానించారు కమలా హ్యారిస్.
Latest news,Telugu news,International news