Home తెలంగాణ హడలెత్తిస్తోన్న స్వైన్‌ ఫ్లూ..!! || Swine flu is raging..!!

హడలెత్తిస్తోన్న స్వైన్‌ ఫ్లూ..!! || Swine flu is raging..!!

0
హడలెత్తిస్తోన్న స్వైన్‌ ఫ్లూ..!! || Swine flu is raging..!!

 

Nsnnews// తెలంగాణలో స్వైన్‌ ఫ్లూ వ్యాప్తి హడలెత్తిస్తోంది. మొన్న కరోనా.. నిన్న డెంగ్యూ.. ఇవాళ స్వైన్‌ ఫ్లూ. వివిధ రకాల వైరస్‌లు.. మానవాళిని వరుసగా వెంటాడుతోన్నాయి. రాష్ట్రంలో నాలుగు స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదవడంతో కలకలం రేగుతోంది.

ఎప్పుడో 2009లో అమెరికాలోని మెక్సికోలో అలజడి సృష్టించిన స్వైన్‌ ఫ్లూ.. ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడు తెలంగాణలో ఏకంగా నాలుగు కేసులు రికార్డ్‌ అవడం గుబులు పుట్టిస్తోంది. హైదరాబాద్‌ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ సెంటర్‌.. నాలుగు స్వైన్ ఫ్లూ కేసులను నిర్ధారించింది. మాదాపూర్‌లో 23 ఏళ్ల యువకుడికి.. టోలిచౌకిలో 69 ఏళ్ల వృద్ధుడు, నిజామాబాద్‌లో ఒకరికి, హైదర్‌నగర్‌లో ఒక మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలు బయట పడడంతో …నలుగురి శాంపిల్స్‌ హైదరాబాద్‌ నారాయణగూడ ఐపీఎం ల్యాబ్‌కు తరలించారు. ఆ శాంపిల్స్‌కు సంబంధించి టెస్టులు నిర్వహించగా.. నలుగురికి స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు నిర్థారణ కావడంతో కలకలం రేపింది. ఇప్పటికే వైరల్‌ ఫీవర్లు హడలెత్తిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వైరల్‌ ఫీవర్లు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. స్వైన్‌ ఫ్లూ వైరస్‌ ఎటాక్‌ చేయడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

Latest news,Telugu news,Telangana news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here