Nsnnews// గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజా పట్టణంలోని స్కూళ్లపై ఇజ్రాయిల్ దాడి చేసింది. కొన్ని రోజులుగా స్కూల్స్ టార్గెట్‌గా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సెంట్రల్ గాజాలోని అబు అరబన్ ప్రాంతంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయిల్ బాంబులు వేసింది. దీంతో స్కూలులో ఆశ్రయం పొందుతున్న గాజా వాసులు 15 మంది మృతి చెందారు.
గాజా స్కూల్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిన ఘటనలో 15 మంది మృతి చెందినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. యుద్దం కారణంగా నిరాశ్రయులైన గాజా వాసులు వేలాది మంది అబు అరబన్ స్కూల్‌లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లోనే గాజా వాసులు ఆశ్రయం పొందుతున్న స్కూళ్లపై ఇజ్రాయిల్ దాడి చేయడం ఇది ఐదవసారి. ఆ దాడిపై ఇజ్రాయిల్ స్పందించింది.
అబు అరబన్ స్కూల్ కేంద్రంగా ఇజ్రాయిల్ సైన్యంపై దాడులు జరుగుతుండటంతోనే తాము కూడా టార్గెట్ చేశామని ఇజ్రాయిల్ తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్, ఇజ్రాయిల్‌పై మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో వందల మంది మృతి చెందారు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయిల్ దాడులను కొనసాగిస్తోంది.
Latest news,Telugu news,Crime news…