సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసుల ప్రత్యేక నిఘా
సామాజిక మాధ్యమాల్లో చట్టవ్యతిరేక పోస్టులు చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టడంలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ ను సీపీ శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియాల్లో ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్ట్ చేసినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.